వైరల్ : చరణ్ గొప్పమనసు..ఉక్రెయిన్ లో తన బాడీ గార్డ్ కి సాయం.!

Published on Mar 19, 2022 7:05 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో ఇతరులకి సాయం చేసే రియల్ లైఫ్ హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారిలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ని తన భుజ స్కందాల పైన మోసే మెగా లెగసి క్యారియర్ గానే కాకుండా సేవాగుణంలో మెగాస్టార్ కి తీసిపోకుండా ముందు నిలబడతాడు.

మరి అలా తాజాగా తాను చేసిన సాయం వైరల్ అవుతుంది. తాను నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” చిత్రం షూటింగ్ ఉక్రెయిన్ లో కూడా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ సమయంలో చరణ్ కి బాడీ గార్డ్ గా పని చేసిన కెయిన్ అనే వ్యక్తికి అతని కుటుంబంకి చరణ్ అండగా నిలవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ అయ్యాక రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల నడుమ ఎంత పెద్ద యుద్దాలు జరిగాయో తెలిసిందే.

మరి ప్రమాదకరమైన పరిస్థితి లో చరణ్ వారికోసం కనుక్కుని ఫోన్ చేసి వారికి భరోసా ఇవ్వడమే కాకుండా వారికి కావలసిన సాయం అందించి ఏం కావాలన్నా తనని అడగమని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా కెయిన్ నే వీడియో ద్వారా రివీల్ చెయ్యగా అది వైరల్ అవుతుంది. మొత్తానికి మాత్రం చరణ్ గొప్ప మనసు ఈ రకంగా బయల్పడడం తో ఈ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :