చరణ్ స్టైలిష్ క్లిక్స్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా !

చరణ్ స్టైలిష్ క్లిక్స్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా !

Published on Nov 27, 2022 6:36 PM IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా కొత్త షెడ్యూల్ కోసం టీమ్ న్యూజిలాండ్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా RC 15 సెట్స్ నుండి చరణ్, హీరోయిన్ కియారా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చరణ్ సూపర్ స్టైలిష్ క్లిక్స్ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్, గోధుమరంగు జాకెట్ వేసుకుని చరణ్ , కెమెరాకి ఫోజులిచ్చాడు. చరణ్ పిక్స్ మెగా అభిమానులకు బాగా నచ్చాయి.

ఇక న్యూజీలాండ్ షెడ్యూల్ లో చరణ్ – కియారా అద్వానీ పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అలాగే ఈ షెడ్యూల్‌లో పాటల సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట.

చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు