వైరల్ : నేపాల్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో రామ్ చరణ్.!

Published on May 1, 2022 4:00 pm IST


రీసెంట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన లేటెస్ట్ భారీ సినిమాల్లో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా రికార్డు వసూళ్లతో ఇప్పటికీ థియేటర్స్ లో మంచి రన్ ని కొనసాగిస్తోంది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యాక ఇద్దరు స్టార్ హీరోలకి కూడా ఎవరికి వారి స్పెషల్ క్రేజ్ దక్కింది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమాలో అల్లూరిగా కనిపించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ ని నేపాల్ లో ఓ ప్రముఖ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజి లో వెయ్యడం ఆసక్తిగా మారింది.

అయితే మ్యాటర్ ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు కానీ ఇలా అక్కడ పేపర్ లో మన టాలీవుడ్ కి చెందిన ఓ హీరో పోస్టర్ ఫ్రంట్ పేజి ఫుల్ గా వెయ్యడంతో అయితే చరణ్ అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్లిప్ మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :