వైరల్ : హాలీవుడ్ ఫేమస్ అవార్డ్స్ లో ప్రెజెంటర్ గా చరణ్.!

Published on Feb 21, 2023 3:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనికి ముందు తాను చేసిన సెన్సేషనల్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” అయితే పాన్ వరల్డ్ లెవెల్లో హిట్ కావడంతో చరణ్ కి గ్లోబల్ గా భారీ ఫేమ్ వచ్చింది. అలాగే వీరి సినిమా పాట ఏకంగా ఆస్కార్ వరకు కూడా వెళ్లి తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంతో గౌరవం లా మారింది.

మరి లేటెస్ట్ గా ఈ అవార్డ్స్ వేడుకకి గాను చరణ్ పయనం కాగా ఈ గ్యాప్ లో మరో ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ వేడుక హెచ్ సి ఏ ఫిలిం అవార్డ్స్ లో తాను ఈ ఫిబ్రవరి 24న పాల్గొననున్నాడు. అయితే ఇందులో అవార్డు ప్రెజెంటింగ్ లో అనేకమంది హాలీవుడ్ నటులతో పాటుగా తాను కూడా ఓ ప్రెజెంటర్ గా పాల్గొననుండడం ఇప్పుడు కేజ్రీగా మారింది. దీనితో చరణ్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :