వైరల్ : తన హ్యాట్రిక్ దర్శకులని క్లిక్ మనిపించిన థలపతి విజయ్.!

Published on Feb 5, 2022 10:02 am IST


మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సహా భారీ బాక్సాఫీస్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోలలో ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ కూడా ఒకరు. అయితే విజయ్ కెరీర్ లో కనుక జస్ట్ గత పదేళ్లు చూసుకున్నట్టయతే తన సినిమాలతో వేరే లెవెల్ కి వెళ్ళిపోయాడు. మరి ఇలా తన లైనప్ లో సాలిడ్ సబ్జెక్టులతో సినిమాలు ఇచ్చిన దర్శకులు కొందరు ఉన్నారు మరి వారిలో అట్లీ, లోకేష్ కనగ్ రాజ్ లు కూడా ఒకరు.

అట్లీ తో తీసిన మూడు సినిమాలు భారీ బాక్సాఫీస్ హిట్స్ గా విజయ్ కెరీర్ లో నిలిచాయి. మరి అలా అట్లీతో హ్యాట్రిక్ సినిమాలు చేసి అక్కడ నుంచి బ్రేక్ తీసుకొని దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో “మాస్టర్” అనే సినిమా చేసి దీనితో కూడా భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో టాలెంటెడ్ దర్శకుడు “డాక్టర్” ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఇప్పుడు “బీస్ట్” అనే భారీ యాక్షన్ సినిమాని చేసాడు.

ఇలా ఈ ముగ్గురు హ్యాట్రి దర్శకులతో వర్క్ చేసిన విజయ్ ఈ ముగ్గురికి కలిపి ఒక ఫోటో ని క్లిక్ మనిపించాడు. దీనితో ఈ ఫోటోని మాస్టర్ దర్శకుడు లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అలా చేసి ఈ ఫోటోని హీరో విజయ్ తీసారని అసలు విషయం చెప్పడంతో ఈ ఫోటో మరింత స్పెషల్ గా మారిపోయింది. దీనితో ఈ పిక్ ఇపుడు భారీ రెస్పాన్స్ తో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :