వైరల్..”బిగ్ బాస్ 5″ డబ్బుతో లగ్జరీ కార్ కొనేసిన కంటెస్టెంట్.!

Published on Nov 27, 2021 5:14 pm IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎవరి ఫేట్ ఎలా మారుస్తుందో ఎవరికీ తెలీదు. ముందు పెద్దగా ఆడియెన్స్ కి తెలియని వారిని కూడా ఈ షో హీరోని చేస్తుంది. ఇక దీనితో పాటుగా పలువురి కంటెస్టెంట్స్ కి కూడా ఈ షో ఆర్ధికంగా కూడా చాలా ప్లస్ గా నిలిచింది. అలానే ఇప్పుడు ఫేమస్ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఈ లేటెస్ట్ సీజన్లో పాల్గొని వచ్చిన డబ్బుతో ఓ ఖరీదైన కారు కొని ఆశ్చర్యపరిచాడు.

అతడు మరెవరో కాదు విశ్వనే. లేటెస్ట్ గా ఓ లగ్జరీ కారు బి ఎం డబ్ల్యూ నుంచి దింపి దానితో ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ముందు అంతా తాను ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి ఇప్పుడు సడెన్ గా బిగ్ బాస్ అమౌంట్ తో ఇంత కార్ కొన్నాడేంటి అని నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఇలా తన ఫేట్ ని బిగ్ బాస్ మార్చింది.

సంబంధిత సమాచారం :