వైరల్ : రామ్ చరణ్ డాషింగ్ లుక్స్ షేర్ చేసిన ఉపాసన.!

Published on Mar 1, 2023 12:01 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అకాడమీ అవార్డ్స్ వేడుకలో భాగంగా యూఎస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అంత కన్నా ముందు అయితే తమ భారీ హిట్ రౌద్రం రణం రుధిరం స్పెషల్ షో స్క్రీనింగ్ కి గాను ప్లాన్ చేయగా ఈ హడావుడిలో అయితే చరణ్ పలు ఇంటర్నేషనల్ మీడియా లతో ముచ్చటిస్తున్నాడు. మరి అలా లేటెస్ట్ గా మరో ప్రముఖ షో లో చరణ్ పాల్గొనగా ఆ షో కి తాను ప్రిపేర్ చేసిన లుక్ మంచి ఆసక్తిగా మారింది.

అలాగే తాను ఈ షో కి పాల్గొన్న పోస్ట్ తాలూకా పిక్ ని తాను షేర్ చేయగా తన లైఫ్ పార్టనర్ ఉపాసన కొణిదెల చరణ్ పై మరిన్ని పిక్స్ షేర్ చేసి ఫైర్ సింబల్ తో ఎలివేట్ చేసింది. మరి ఆ ఫైర్ కి తగ్గట్టుగానే చరణ్ కూడా సూపర్ డాషింగ్ గా ఈ లుక్ లో కనిపిస్తున్నాడు. తన డ్రెస్సింగ్ గాని తన హెయిర్ స్టైల్ మరియు గడ్డం మంచి డాపర్ గా కనిపిస్తున్నాడు. దీనితో చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :