వైరల్ : ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ కి కీలక మార్పు..?

Published on Nov 21, 2021 8:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు ప్రాజెక్ట్ లలో ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన సినిమాలు “రాధే శ్యామ్” మరియు “ఆదిపురుష్” లు కూడా ఒకటి. మరి ఈ భారీ సినిమాలు తర్వాత ప్రభాస్ తన ఫస్ట్ ఎవర్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని మినిమమ్ స్టార్టింగ్ బడ్జెట్ నే 500 కోట్లతో వైజయంతి నిర్మాణ సంస్థ కేటాయించింది.

అందుకే ఇండియన్ సినిమా దగ్గరే అత్యంత ఖరీదైన సినిమాగా ఇది అనిపించుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఇప్పుడు కీలక మార్పు ఏమన్నా జరిగిందా అని అనిపిస్తుంది. ఈ భారీ సినిమాకి టాలెంటడ్ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అతడిని కోలీవుడ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ రీప్లేస్ చేశాడా? అనే ప్రశ్న మొదలైంది.

ఎందుకంటే వైజయంతి వారి ట్వీట్ ని సంతోష్ రీట్వీట్ చెయ్యడం జరిగింది. దీనితో ఈ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి. సంతోష్ ఇచ్చిన “కాలా”, “కబాలి” మ్యూజిక్ లు తెలుగు ఆడియెన్స్ కి కూడా గుర్తే మరి ఈ సినిమా వరకు తన పాత్ర ఏంటో అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :