వైరల్ వీడియో : బాలయ్య హిట్ సాంగ్ కి అనిల్ రావిపూడి సూపర్ స్టెప్స్

Published on May 17, 2023 9:03 pm IST

యువ దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి సక్సెస్ఫుల్ సినిమాలతో కొనసాగుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కెరీర్ 108వ మూవీని ఆయన తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై దీనిని గ్రాండ్ లెవెల్లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్ర చేస్తుండగా దీనికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. విషయం ఏమిటంటే, తాజాగా డాన్స్ మాస్టర్స్ భాను మాస్టర్, వెంకట్ మాస్టర్ తో కలిసి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ లారీ డ్రైవర్ నుండి బాలయ్య బాలయ్య సాంగ్ కి స్టెప్స్ అదరగొట్టారు. కాగా సరదాగా తాను డ్యాన్స్ చేసిన ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :