వైరల్ వీడియో: ‘దసరా’ చార్ట్‌బస్టర్ పాటకు నజ్రియాతో కలిసి డ్యాన్స్ చేసిన నాని భార్య

Published on Mar 22, 2023 6:47 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యువ సక్సెస్ఫుల్ భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా దసరా. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని కూడా ఎంతో ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచాయి. కాగా ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో మార్చి 30న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

మరోవైపు ఈ మూవీకి సంబంధించి పలు ఇతర భాషల్లో కూడా గ్రాండ్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది యూనిట్. అయితే విషయం ఏమిటంటే, ఇందులోని చమ్కీల అంగీలేసి సాంగ్ ఇప్పటికే పాపులర్ కాగా నేడు ఈ సాంగ్ కి యువ హీరోయిన్ నజ్రియా తో కలిసి నాని సతీమణి అంజనా యలవర్తి సరదగా డ్యాన్స్ చేసారు. కాగా తామిద్దరి ఈ డ్యాన్సింగ్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు అంజనా. ప్రస్తుతం ఈ వీడియో కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

సంబంధిత సమాచారం :