వైరల్..ఏపీలో టికెట్ ధరలపై ఓపెన్ అయ్యిన సీఎం వై ఎస్ జగన్.!

Published on Jan 1, 2022 9:08 pm IST

ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని నెలల నుంచి కూడా టికెట్ ధరల సమస్య ఎంతలా నెలకొందో అందరికీ తెలిసిందే. దీని చుట్టూనే అనేక ట్విస్టులతో అటు రాజకీయ మరియు సినీ వర్గాల్లో ఈ సమస్య అలా పరిష్కారం లేకుండానే తిరుగుతూ వస్తుంది. మరి ఏదొకలా ఈ సమస్యని సాల్వ్ చేద్దామని సినీ పెద్దలు చాలా ప్రయత్నించినా సానుకూల స్పందన అయితే ఏపీ ప్రభుత్వం నుంచి రాలేదు.

ఎట్టకేలకు ఈ సున్నిత అంశంపైనే ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఓపెన్ అయ్యి కీలక కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వినోదాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాని ఈ నిర్ణయాన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా వీటితో పాటుగా ఆ విమర్శలు చేసే వారు అంతా యాంటీ పూర్(పేదలకు వ్యతిరేఖం) అని సంచలన కామెంట్స్ చేశారు. దీనితో ఇవి ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతన్నాయి.

సంబంధిత సమాచారం :