వైరల్ అవుతున్న “విరాట్ కోహ్లీ” తగ్గేదే లే సిగ్నేచర్ మూమెంట్!

Published on Mar 6, 2022 8:00 pm IST

శ్రీలంక తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మైదానం లో తగ్గేదే లే అంటూ చేసిన సిగ్నేచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విరాట్ కోహ్లీ తన వందో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించడంతో అటు క్రికెట్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు, క్రికెటర్లు, సినీ పరిశ్రమ కి చెందిన వారు పుష్పరాజ్ పాత్ర లాగా ఇమిటేట్ చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. అయితే విరాట్ చేసిన సిగ్నేచర్ మూమెంట్ పట్ల ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప ది రూల్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు అభిమానులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :