డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న రానా “విరాట పర్వం”

Published on Jun 17, 2022 5:00 pm IST


రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా వేణు ఉడుగుల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం లో హీరో, హీరోయిన్ ల నటన కి గానూ, ప్రేక్షకుల నుండి, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ ప్రీమియర్ గా నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

మంచి ధరకి విరాట పర్వం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.సుధాకర చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :