“విరాట పర్వం” విపరీత ఆలస్యంపై దర్శకుని ఎమోషనల్ స్పందన.!

Published on Jun 8, 2022 8:30 pm IST

మన టాలీవుడ్ హల్క్ హీరో రానా దగ్గుబాటి హీరోగా అలాగే నాచురల్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “విరాట పర్వం”. ఎప్పుడో ప్యాండమిక్ కన్నా ముందే స్టార్ట్ చేసి 2020 లోనే రిలీజ్ చేసెయ్యాల్సి ఉన్న ఈ చిత్రం ఫైనల్ గా రెండేళ్ల తర్వాత థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది.

అయితే అప్పట్లో ఉన్న సినిమాల లిస్ట్ లో ఈ సినిమాకే ఒకింత ఎక్కువ డిలే వచ్చింది అని చెప్పాలి. చాలా సార్లు అనుకున్న విధంగా ఈ చిత్రం రిలీజ్ కాకపోవడంతో దీనిపై లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకుడు తన స్పందనను తెలియజేసాడు.

ఈ చిత్రం ఆలస్యం అవుతున్న కొద్దీ మానసికంగా చాలా బాధ పడేవాడిని అని కానీ ఫైనల్ గా థియేటర్స్ రిలీజ్ కే తీసుకొస్తున్నందుకు నా నిర్మాతలకి థాంక్స్ చెప్తున్నానని వారు ఈ సినిమాకి పలు భారీ ఓటిటి ఆఫర్స్ వచ్చినా కూడా వదులుకొని థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నారని ఈ ఒక్క విషయంలో తన ఎమోషన్ ని బయట పెట్టాడు.

సంబంధిత సమాచారం :