“ఆచార్య” టెన్షన్ రానా అభిమానుల్లో గట్టిగానే ఉందిగా?

Published on Jun 4, 2022 2:20 am IST

దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రమె ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది. అయితే కొద్ది రోజుల నుంచి చిన్న, పెద్ద సినిమాలన్ని వరుసపెట్టి థియేటర్లలో రిలీజ్‌ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో జూన్ 17వ తేదీన ఈ సినిమాను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ఓకే అన్నారు.

అయితే ఇంతకుముందు చిరంజీవి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా కూడా నక్సలిజం నేపథ్యంలోనే తెరక్కించారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో అదే నక్సలిజం నేపథ్యంలో రానున్న ‘విరాటపర్వం’ ఆడియన్స్‌కి నచ్చుతుందో లేదో అన్న ఆలోచనలో రానా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :