“విరాట పర్వం” టీం “క్యాష్” స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోకి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Jun 14, 2022 10:06 am IST

ఈ వారం సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో టాలీవుడ్ లో ఎప్పుడు నుంచో మంచి అవైటెడ్ గా ఉన్న చిత్రం “విరాట పర్వం” కూడా ఒకటి. టాలీవుడ్ హల్క్ హీరో రానా దగ్గుబాటి మరియు యంగ్ హీరోయిన్ సాయి పల్లవిలు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం ఫైనల్ గా మంచి అంచనాలు ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు టాప్ టెలివిజన్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీలో సూపర్ హిట్ ఎంటర్టైనింగ్ షో “క్యాష్” కి రానా మినహా ఇతర యూనిట్ సభ్యులు వచ్చారు. సాయి పల్లవి, దర్శకుడు వేణు, నటుడు నవీన్ చంద్ర వచ్చారు. మరి ఈ టీం వచ్చి సందడి చేసిన ఈ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తాలూకా ప్రోమో నిన్న రిలీజ్ కాగా..

దీనికి కేవలం 5 గంటల్లోనే 1 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా ఇప్పుడు 16 గంటల్లో 2 మిలియన్ అంటే 20 లక్షలకి పైగా వ్యూస్ ని అందుకొని సెన్సేషనల్ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. ఈ ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జూన్ 18 శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకి ఈటీవీలో మిస్సవ్వకుండా చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :