నెక్స్ట్ కేరళకు వెళ్లనున్న రానా

Rana Daggubati

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూట్ హైదరాబాద్లో రీస్టార్ట్ అయింది. సుమారు ఆరు రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది. దీంతో టీమ్ తర్వాతి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం టీమ్ కేరళ వెళ్లనున్నారు. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన రానా ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు సమర్పిస్తున్నారు. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ లైన్ వింటేనే సినిమాలో ఒక బలమైన ప్రేమ కథ ఉంటుందని ఇట్టే అర్థమవుతోంది. వచ్చే యేడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version