‘KGF 2’ పవర్ఫుల్ డైలాగ్ తో ఛత్రపతి శివాజీకి సెహ్వాగ్ ఎలివేషన్ వైరల్!

chhatrapathi-shivaji

పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ చూసిన పలు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం కేజీయఫ్ సిరీస్ కూడా ఒకటి. ఇక ఇందులో దర్శకుడు ప్రశాంత్ నీల్ రైటింగ్ గాని తన మార్క్ మాస్ డైలాగ్స్ గాని పాన్ ఇండియా ఆడియెన్స్ కి ఊపేసాయి.

అలాంటి ఇంపాక్ట్ కలిగించిన పవర్ఫుల్ డైలాగ్ తో రియల్ లైఫ్ హీరో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మన ఇండియన్ స్టార్ క్రికెటర్ సెహ్వాగ్ ఎలివేషన్ ఇవ్వడం వైరల్ గా మారింది. నేడు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారతదేశం అంతా ఈరోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది.

కేజీయఫ్ 2 టీజర్ లో పవర్ఫుల్ మనుషులు పవర్ఫుల్ ప్రదేశాల నుంచి వస్తారు అనేది రాంగ్ పవర్ఫుల్ వ్యక్తులు ఆ ప్రాంతాన్నే పవర్ఫుల్ గా మారుస్తారు అంటూ అలాంటి పవర్ఫుల్ వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఘన నివాళులు అర్పిస్తున్నాని సెహ్వాగ్ తన మార్క్ ఎలివేషన్ ని అందించారు. దీనితో కేజీయఫ్ అభిమానులు, సెహ్వాగ్, ముఖ్యంగా శివాజీ మహారాజ్ అభిమానులు సెహ్వాగ్ పోస్ట్ తో ఆనందం వ్యక్తం చేస్తూ దీనిని మరింత వైరల్ చేస్తున్నారు.

Exit mobile version