యూత్‌ని టార్గెట్ చేస్తూ చేసిన ప్రత్యేకమైన సినిమా “వర్జిన్ స్టోరీ”..!

Published on Feb 18, 2022 2:22 am IST

ప్రముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్ సరసన సౌమిక పాండియన్, రిషిక ఖన్నా హీరోయిన్లుగా నటించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ‘వర్జిన్ స్టోరీ’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తెర్కెక్కినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా కూడా యూత్‌ని బాగా ఆకట్టుకోవడంతో ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సో “వర్జిన్ స్టోరీ” కూడా యూత్‌ని ఆకట్టుకోగలిగితే మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :