మూడవ సినిమాకి సిద్దమవుతున్న విరించి వర్మ !

12th, November 2017 - 09:48:53 AM

రాజ్ తరుణ్, అవికా గోర్ లతో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఉయ్యాల జంపాల’ చిత్రం తెరకెక్కించిన విజయంతో పాటు మంచి అభిరుచి కలిగిన దర్శకుడనే పేరు తెచ్చుకున్న విరించి వర్మ ఆ తర్వాత నానితో ‘మజ్ను’ చిత్రాన్ని రూపొందించి వరుసగా రెండవ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు తన మూడవ సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నాడు.

ఈ చిత్రాన్ని కీర్తి కంబైన్స్, పద్మజ పిక్చర్స్ సమర్పణలో ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూరిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మొదలుకానుంది. ఈ చిత్రం కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే ఉండనుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.