ప్రమోషన్స్ షురూ చేసిన “విరూపాక్ష” టీమ్

Published on Mar 14, 2023 11:00 am IST

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. శ్రీ వేంకటేశ్వర చిత్ర ఎల్ ఎల్ పీ మరియు సుకుమార్ రైటింగ్స్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం రిలీజ్ కు దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్సస్ ను షురూ చేయడం జరిగింది. అక్షరాల వెనుక ఉన్న అంకెలు, ఆ అంకెలే కథకు ఆరంభం అంటూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. పజిల్ ను డీకోడ్ చేయండి అంటూ ఆడియెన్స్ కు టాస్క్ ఇచ్చారు మేకర్స్. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :