దసరాకు రిలీజ్ కాబోతున్న విశాల్, ఆర్యల ‘ఎనిమీ’..!

Published on Sep 6, 2021 11:35 pm IST


యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ “ఎనిమీ”. ఈ చిత్రంలో మృణాళిని రవి, మమత మోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ క్రేజీ మల్టీ స్టారర్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు విశేష ఆదరణ లభించింది.

అయితే ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. చెన్నై, హైదరాబాద్ మరియు దుబాయ్‌లో ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :