వైరల్ అవుతోన్న పునీత్ పై విశాల్‌ స్పీచ్ !

Published on Nov 1, 2021 1:00 pm IST

కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌ కుమార్‌ సేవ గురించి, ఆయన గొప్పతనం గురించి హీరో విశాల్ మాట్లాడుతూ.. అలాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని, పునీత్‌ లేరనే విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, పునీత్ మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి కూడా తీరని లోటు. తన కళ్లు కూడా దానం చేశారు. ఒక ఫ్రెండ్ గా పునీత్‌ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తాను.

పునీత్ చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను అని మాటిస్తున్నాను అంటూ విశాల్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక విశాల్, ఆర్య హీరోలుగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘ఎనిమి’. కాగా ఈ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More