పునీత్ ను తలచుకొని ఎమోషనల్ అయిన విశాల్…ఎనిమీ ప్రీ రిలీజ్ వేడుక లో కీలక వ్యాఖ్యలు

Published on Oct 31, 2021 11:33 pm IST

పునీత్ రాజ్ కుమార్ ఒక మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మిత్రుడు. మంచి మనిషి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఊహించ లేకపోతున్నాం అని విశాల్ ఎనిమీ ప్రీ రిలీజ్ వేడుక లో అన్నారు. పునీత్ రాజ్ కుమార్ నో మోర్ అనేది చదవడానికి కానీ, వినడానికి కానీ డైజెస్ట్ చేసుకోలేక పోతున్నాం అని అన్నారు. ఇది సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే లాస్ కాదు అని, సమాజానికి, తన కుటుంబానికి, తన ఆత్మీయులకు, తన తో అసోసియేట్ అయిన వారికి లాస్ అంటూ చెప్పుకొచ్చారు.

పునీత్ రాజ్ కుమార్ లాంటి డౌన్ టు ఎర్త్ మనిషిని సినిమా ఇండస్ట్రీ లో నేను చూడలేదు అని భావోద్వేగం అయ్యారు. ఇంట్లో కాని, బయట కానీ, మేకప్ వేసుకున్నా, వేసుకోక పోయినా ఒకేలా ఉండే వ్యక్తి అంటూ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి ఈ పరిస్థితుల్లో అని అన్నారు. అంతేకాక పునీత్ 1,800 మందికి ఉచిత చదువు, అనాథ ఆశ్రమాలను నడపడం, వృద్ధాశ్రమాలను చూసుకోవడం లాంటి సేవలను కొనియాడారు. అంతేకాక చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను దానం చేశారు అని తెలిపారు. ఒక మిత్రుడు గా ఆ 1,800 మంది పిల్లలకి చదువు అందిస్తా వచ్చే ఏడాది నుండి అంటూ విశాల్ ఈ కార్యక్రమం లో అన్నారు.

సంబంధిత సమాచారం :