విశాల్ ‘లాఠీ’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

విశాల్ ‘లాఠీ’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Dec 10, 2022 2:00 AM IST


యాక్షన్ హీరో విశాల్ ఇటీవల పలు విభిన్న కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ లతో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఆయన చేస్తున్న భారీ యాక్షన్ మూవీ లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ మూవీలో విశాల్ ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే విషయం ఏమిటంటే, లాఠీ థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 12 న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్క్ చేసారు. రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా అతి త్వరలో దీనిని భారీ స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకువచేదుకు సిద్ధం అవుతోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు