విశాల్, తమన్నాల కోసం కాజల్..!

19th, October 2016 - 11:01:20 PM

okkadochu
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఎదుగుతోన్న విశాల్, అందాల తార తమన్నాలు హీరో, హీరోయిన్లుగా నటిస్తోండగా ‘కత్తి సందై’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. విశాల్ స్టైల్లో సాగిపోయే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో విడుదల కానుంది. కొద్దినెలల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా అసలు కథను పరిచయం చేస్తూ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది.

అక్టోబర్ 21న సాయంత్రం ఆరు గంటలకు స్టార్ హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కానుంది. ఇక తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాక తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న జగపతి బాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని తెలుస్తోంది. విశాల్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు జి.హరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.