అభిమన్యుడు మోషన్ పోస్టర్ రేపు విడుదల !
Published on Nov 25, 2017 7:23 pm IST

విశాల్, స‌మంత‌, అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘అభిమ‌న్యుడు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిత్రన్ ఈ సినిమాకు దర్శకుడు. యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇటివల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే.

త‌మిళంలో ‘ఇరుంబు తిరై’ పేరుతో విడుదల కానుంది. మైండ్ గేమ్ నేపద్యంలో తెరకెక్కిన ఈ మూవీ టెక్నీక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. ఇటివల విశాల్ ‘డిటేక్టివ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 
Like us on Facebook