సరికొత్త గెటప్‌ తో ‘మార్క్‌ ఆంటోని’గా యాక్షన్ హీరో

Published on Jan 3, 2022 8:07 am IST


యాక్షన్ హీరో విశాల్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాకి ‘మార్క్‌ ఆంటోని’ అనే టైటిల్‌ ఫిక్స్ చేసింది టీమ్. కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ లుక్‌ ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో విశాల్‌ గన్‌ పట్టుకుని అస్థిపంజారాల మధ్య నుంచి నడిచి వెళ్లడం కనిపించింది. పోస్టర్ బాగుంది.

విశాల్ ఈ సినిమాలో ఓ సరికొత్త గెటప్‌ తో శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న సినిమా ఇది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నాం. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం’’అంటూ చిత్ర నిర్మాత చెప్పాడు.

సంబంధిత సమాచారం :