ఈ సినిమాకి ఏకంగా 300 మందితో విశాల్ భారీ యాక్షన్ సీక్వెన్స్.!

Published on Jan 11, 2022 11:34 pm IST

కోలీవుడ్ మరియు అలాగే మన టాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకడు. అయితే విశాల్ కి ఇప్పుడు అక్కడ తమిళ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. తాను తీసిన లాస్ట్ సినిమాలు అన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ గానే నిలిచాయి. అయినా మంచి లైనప్ తో విశాల్ ఇప్పుడు రెడీ అవుతున్నాడు.

మరి ఈ లైనప్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు ఏ వినోత్ కుమార్ తెరకెక్కిస్తున్న “లాఠీ” కూడా ఒకటి. పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కి గాను ఏకంగా 300 మందితో విశాల్ పాల్గొంటున్నాడట.

దీనికి చెందిన వీడియో కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. అలాగే ఈ ఫైట్ సీక్వెన్స్ ని ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. మరి ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి గాను సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా రానా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :