విశాల్ సరికొత్త చిత్రం “సామాన్యుడు” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Nov 24, 2021 1:17 am IST


హీరో విశాల్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. విశాల్ ప్రస్తుతం తు పా శరవణన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విశాల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. ఈ టైటిల్ తో ఉన్న ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వస్తోంది.

ఈ చిత్రం కి సామాన్యుడు అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేయడం జరిగింది. అంతేకాక నాట్ ఎ కామన్ మ్యాన్ అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 26 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలైన సరికొత్త పోస్టర్ లో విశాల్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యోగి బాబు, బాబురాజు జాకబ్, పీఎ తులసీ, రవీనా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్ గా డింపుల్ హాయతీ నటిస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :