ఉత్కంఠగా విశాల్ “సామాన్యుడు” ట్రైలర్..!

Published on Jan 19, 2022 7:56 pm IST

యాక్షన్ హీరో విశాల్‌ హీరోగా, కొత్త దర్శకుడు తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ అనేది ట్యాగ్‌లైన్. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించాడు. జనవరి 26న ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్లలో విశాల్‌ ఎప్పటిలానే అదరగొట్టినట్టు ట్రైలర్‌ని చూస్తే అర్దమవుతుంది. అంతేకాదు విశాల్ చెప్పిన డైలాగ్స్ ఆద్యంతం ఉత్కంఠగా అనిపించాయి. ఇక యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :