అవార్డు చెత్త బుట్టలో పడేస్తా – విశాల్

Published on Sep 3, 2023 8:00 pm IST

తమిళ యాక్షన్ హీరో విశాల్ అవార్డులపై తనకు ఎటువంటి నమ్మకం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోని’ ఈ నెల 15న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ కార్యక్రమానికి హాజరైన విశాల్ జాతీయ అవార్డులపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇంతకీ, విశాల్ ఏం మాట్లాడాడు అంటే.. ‘ఫలానా అవార్డు నాకు రావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అసలు అవార్డులపై నాకు మొదటి నుంచి నమ్మకం లేదు. అందుకే, నేను ఎప్పుడు నాకు అవార్డు రావాలని అనుకోను.

నా దృష్టిలో ప్రజలందరూ కలిసి ఇచ్చేదే నిజమైన అవార్డు అంటూ విశాల్ చెప్పుకొచ్చాడు. అలాగే విశాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల ఆశీస్సులతో ఇన్నేళ్లపాటు పరిశ్రమలో నిలదొక్కుకున్నాను. పలు చిత్రాల్లో నటిస్తున్నాను. ఇంతకు మించిన నిజమైన అవార్డు ఏముంటుంది ?, అందుకే, నాకు పెద్ద అవార్డు ప్రేక్షకుల నుంచే వస్తోంది అంటూ విశాల్ కామెంట్స్ చేశాడు. పనిలో పనిగా ఒకవేళ తన చిత్రాలకు అవార్డులు వచ్చినా వాటిని తాను చెత్తబుట్టలో పడేస్తాను’ అంటూ విశాల్ అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :