హిట్ సినిమాకి సీక్వెల్ ను మొదలుపెట్టనున్న విశాల్ !

తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ చిత్రం తమిళనాట ఘనవిజయాన్ని అందుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా 400లకు పైగానే స్క్రీన్లలో ‘డిటెక్టివ్’ పేరుతో గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విజయం విశాల్ కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో ఆయన ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘డిటెక్టివ్-2’ ను చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈమేరకు త్వరలో అధికారిక ప్రకటనను కూడా విడుదలచేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మొదలుకానున్న ఈ చిత్రాన్ని కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఇది కూడా పూర్తిగా డిటెక్టివ్ తరహా నైపథ్యంలోనే, థ్రిల్లింగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా ‘డిటెక్టివ్’ ను డైరెక్ట్ చేసిన మిస్కిన్ దర్శకత్వం వహించనుండగా విశాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.