ప్రతి టిక్కెట్ నుండి 1 రూపాయిని రైతులకివ్వనున్న స్టార్ హీరో !


దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన తమిళ సినీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ పలు కీలక పదవుల్ని దక్కించుకుని, అందరి మన్ననలు పొందేలా పనిచేస్తున్న విశాల్ సామాజిక సమస్యలు ముఖ్యంగా రైతుల సమస్యలపై అప్పుడప్పుడు గళం విప్పుతూ చేతనైన సాయం చేస్తున్న ఆయన తాజాగా మరొక ప్రయత్నానికి సిద్ధమయ్యారు.

అదేమిటంటే ఈరోజు విడుదలవుతున్న ఆయన చిత్రం ‘తుప్పరివాలన్’ సినిమాకు అమ్ముడయ్యే ప్రతి టికెట్టులో ఒక రూపాయిని కష్టాల్లో ఉన్న రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనున్నారు. డిటెక్టివ్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని మిస్కిన్ తెరకెక్కించారు. ఇకపోతే విశాల్ త్వరలోనే పూర్తిస్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని కూడా ప్రకటించారు.