విశాల్ “లాఠీ” చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 22, 2022 5:05 pm IST

మాస్ మరియు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన విశాల్ తదుపరి పాన్ ఇండియా చిత్రం లాఠీ లో కనిపించనున్నాడు. ఎ. వినోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రానా ప్రొడక్షన్స్ దీనిని నిర్మిస్తోంది. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునైనా కథానాయిక గా నటిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం కి సంబంధించిన ఇంటెన్స్ అండ్ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

ఈ చిత్రం ను ఆగస్ట్ 12 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పోస్టర్ లో విశాల్ గాయాలతో, నవ్వుతూ కనిపిస్తున్నాడు. లాఠీ అనేది సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రభావితం చేసే శక్తివంతమైన వస్తువు. ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు. ఇది కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ దర్శకుడు ఎ వినోద్‌ కుమార్‌ ఒక నవల కథాంశంతో తెరకెక్కించారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెకండాఫ్‌లో 45 నిమిషాల యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి.

ఈ చిత్రానికి సంగీతం సామ్ సిఎస్, DOP బాలసుబ్రమణియన్, స్టంట్ డైరెక్టర్లు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :