విశాల్ “సామాన్యుడు” ట్రైలర్ విడుదల కి సిద్దం

Published on Jan 17, 2022 8:31 pm IST

నటుడు విశాల్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం సామాన్యుడు. ఈ చిత్రం ఈ రిపబ్లిక్ డే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు తు పా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ చిత్రం వీరమే వాగై సూదుం యొక్క డబ్బింగ్ వెర్షన్.

ఈరోజు, సామాన్యుడు థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 19, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విశాల్ తన హోమ్ బ్యానర్ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మించిన తమిళ – తెలుగు చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అంతేకాకుండా, తమిళ వెర్షన్ కూడా జనవరి 26, 2022 న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :