“ది బేకర్ అండ్ ది బ్యూటీ” చూడటానికి నాలుగు కారణాలు చెప్పిన విష్ణు ప్రియ… ఏంటో తెలుసా?

Published on Sep 19, 2021 3:24 pm IST


ఆహా వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీ. ఈ వెబ్ సిరిస్ పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించిన ఈ ఆహా వీడియో ఇప్పుడు ది బేకర్ అండ్ ది బ్యూటీ అంటూ సరికొత్త లవ్ అండ్ రొమాంటిక్ సిరీస్ ను ప్రేక్షకులకు అందించడం జరిగింది. అయితే ఈ సీరీస్ చూడటానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఈ సీరీస్ లో నటించిన భీమినేని విష్ణు ప్రియ పలు కారణాలను వివరించడం జరిగింది.

ది బేకర్ అండ్ ది బ్యూటీ సీరీస్ ను చూడటానికి నాలుగు కారణాలు ఉన్నాయి అని తెలిపారు. మొదటి కారణం అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. రెండవ కారణం ఈ సీరీస్ లో నటించిన నటీనటులు. మూడవ కారణం ఇంటర్ నేషనల్ స్టాండర్డ్ లో ఉండటం, నాల్గో కారణం తను ఈ సీరీస్ లో నటించడం అని తెలిపారు. సంతోష్ శోభన్, టినా శిల్ప రాజ్, విష్ణు ప్రియ ప్రధాన పాత్రల్లో ఉన్న ఈ సీరీస్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ సీరీస్ లో విష్ణు ప్రియ నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :