‘మా’ ఎన్నికల పై విష్ణు ట్వీట్ వైరల్ !

Published on Oct 11, 2021 9:02 am IST

‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ పై ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా విష్ణు ట్వీట్ చేస్తూ.. ‘అందరికీ శుభోదయం! నా సినిమా సోదరులు నా పై చూపించిన ప్రేమకు మరియు వాళ్ళు నాకిచ్చిన మద్దతుకు నేను వినయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ‘MAA’ ఎన్నికల పై నేను ఏదైనా చెప్పే ముందు; ఈసి సభ్యులు, జాయింట్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ పోస్టులలో ఒకదానికి కౌంటింగ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి, ఆ కౌటింగ్ పూర్తి అయ్యాక మాట్లాడతాను’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు.

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. చివరకు ప్రకాశ్‌రాజ్‌ పై విష్ణు విజయం సాధించారు. ఇక జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ గెలిచారు.

సంబంధిత సమాచారం :