‘ఖిలాడి’కి పోటీగా ‘ఎఫ్.ఐ.ఆర్’.. కిక్కిచ్చే అంశం ఏమిటంటే?

Published on Feb 1, 2022 2:00 am IST

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి పోటీగా అదే తేదీన విష్ణు విశాల్‌ హీరోగా నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అయితే ఇక్కడ కిక్కిచే మరో అంశం ఏమిటంటే ‘ఎఫ్.ఐ.ఆర్’ మూవీకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో విష్ణు విశాల్ తన సొంత బ్యానర్‌లో నిర్మించగా, తెలుగు హక్కుల్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ పొందింది.

అయితే సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే ఓ అమాయక యువకుడి జీవితంలో భయంకరమైన ఐఎస్ఐ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా కారణంగా ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అనేది ‘ఎఫ్.ఐ.ఆర్’ కథ. ఇందులో స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి త‌దిత‌రులు ఇతర పాత్రలను పోశించారు.

సంబంధిత సమాచారం :