ఓటీటీలోకి వచ్చేస్తున్న విష్ణు విశాల్ ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’..!

Published on Mar 4, 2022 11:00 pm IST


కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్.ఐ.ఆర్’. ఫిబ్రవరి 11న తమిళం, తెలుగులో ఏకాకాలం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ పోలీసు అధికారిగా నటించగా, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించారు.

సంబంధిత సమాచారం :