సాలిడ్ గా విష్ణు విశాల్ “మట్టి కుస్తీ” ఫస్ట్ లుక్.!

సాలిడ్ గా విష్ణు విశాల్ “మట్టి కుస్తీ” ఫస్ట్ లుక్.!

Published on Nov 2, 2022 11:00 AM IST

మన టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి తన సినిమాలతో పాటుగా కొన్ని ఇతర సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు విష్ణు విశాల్ తో అనౌన్స్ చేసిన ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా మట్టి కుస్తీ కూడా ఒకటి. ఇక ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మరి ఇప్పుడు ఈ పోస్టర్ అయితే అనుకున్న టైం కే మేకర్స్ రిలీజ్ చేసారు. మరి ఈ పోస్టర్ లో విష్ణు విశాల్ మంచి ఇంటెన్స్ గా కనిపిస్తుండగా కుస్తీ కోసం రంగంలో దిగుతున్న యోధుడిలా సాలిడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి చెల్ల అయ్యవు దర్శకత్వం వహిస్తుండగా రాధే శ్యామ్, డియర్ కామ్రేడ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే రవితేజ మరియు విష్ణు విశాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని అయితే నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు