మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ !


హీరో మంచి విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. టైటిల్ లోనే పూర్తి వైవిధ్యం నింపుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని పార్టీ స్థాయిలో అలరించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ మొదటి నుండి చెబుతున్నారు. ఇకపోతే మే 5వ తేదీన అమెరికాలో మొదలైన ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది.

మంచు విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత ఎమ్. ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జి. నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా కెరీర్లో సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న మంచు విష్ణుకు ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ దొరుకుతుందని చిత్ర సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.