ఓటీటీ రిలీజ్ పై విశ్వక్ సేన్ వివరణ !

Published on May 9, 2022 4:00 pm IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా పై ఒక రూమర్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమిటి ఆ రూమర్ అంటే.. ఈ చిత్రం ఓటీటీలో వచ్చేస్తుంది అని.

కాగా ఈ వార్త పై హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా స్పందిస్తూ.. ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘మా సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు నా కృతజతలు. ప్రేక్షకులు చూపించిన అభిమానం మరిన్ని మంచి సినిమాలు తీసే ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే, మా సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ అవుతుందని పుకార్లు పుట్టించారు. ఇది పూర్తిగా అవాస్తవం. దయ చేసి ఓటీటీ విడుదల అంటూ చేసిన పోస్ట్‌లను తొలగించండి’’అంటూ విశ్వక్‌సేన్‌ చెప్పారు.

సంబంధిత సమాచారం :