‘ఇది చిన్న బ్రేక్ మాత్ర‌మే’ – విశ్వ‌క్ సేన్

‘ఇది చిన్న బ్రేక్ మాత్ర‌మే’ – విశ్వ‌క్ సేన్

Published on Jul 5, 2024 3:56 PM IST

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ తాజాగా త‌న కొత్త సినిమా ‘లైలా’ ను పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వ‌క్ తొలిసారి ఓ లేడీ గెటప్ లో క‌నిపిస్తాడు. దీంతో ఈ సినిమాలో ఆయ‌న లుక్స్ ప‌రంగా ఎలా ఉండ‌బోతున్నాడా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

అయితే, రీసెంట్ గా విశ్వ‌క్ త‌న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశాడు. ఆయ‌న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డియాక్టివేట్ చేశాడా అని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న అభిమానుల‌కు ఓ క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో.

”గ‌తకొద్ది రోజులుగా నా ఇన్ట్సాగ్రామ్ అకౌంట్ ను ఎందుకు డియాక్టివేట్ చేశాను అని అభిమానుల నుండి వ‌రుస‌గా మెసేజ్ లు వ‌స్తున్నాయి.. నేను కొద్దిరోజులు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నాకు ఏదో హాని జ‌రుగుతుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. ఇందులో భాగంగా నా ఇన్ట్సాగ్రామ్ ను డియాక్టివేట్ చేశాను. నా ట్విట్ట‌ర్ హ్యాండిల్ ని కూడా నా టీమ్ మేనేజ్ చేస్తుంది. సోష‌ల్ మీడియాలో ఉంటేనే జీవితం ముందుకు సాగుతుంద‌ని కాదు.. అందుకే ఈ సోష‌ల్ మీడియాను కొంత‌వ‌ర‌కే సీరియ‌స్ గా తీసుకోండి. నేను నా నెక్ట్స్ మూవీ రిలీజ్ త‌రువాత తిరిగి సోష‌ల్ మీడియాలోకి రావ‌చ్చు, రాక‌పోవచ్చు.” అంటూ విశ్వ‌క్ క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు