విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ నుంచి క్రేజీ అప్ డేట్ !

విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ నుంచి క్రేజీ అప్ డేట్ !

Published on Nov 28, 2022 7:08 PM IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న ధమ్కీ చిత్రం ఫిబ్రవరి 17, 2023న థియేటర్లలోకి రానుంది. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు ఒక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ అనే మొదటి సింగిల్ రిలీజ్ గురించి చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ ముంబైలో రికార్డ్ చేయబడింది అని, ఇక ఈ పాట విడుదల తేదీని సరేగామ మ్యూజిక్ లేబుల్ ద్వారా ప్రకటిస్తామని విశ్వక్ సేన్ ఒక పోస్ట్ పెట్టాడు.

కాగా వన్మయి క్రియేషన్స్‌, విష్వక్సేన్ సినిమాస్‌ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ధమ్కీ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతుంది.

https://www.instagram.com/reel/Clf5pJNpzcI/?igshid=YmMyMTA2M2Y%3D

సంబంధిత సమాచారం

తాజా వార్తలు