మన టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు తన ‘కల్ట్’ మోడ్ లో కొనసాగుతున్నాడు. కానీ దీనికి ముందు వచ్చిన ఫంకీ చిత్రం మాత్రం అనుకున్న రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. పట్టుమని వారం రోజులు కూడా ఈ సినిమా నిలబడలేకపోయింది. అయితే రిలీజ్ కి ముందు మేకర్స్ అంతా నమ్మకంగానే ఉన్నారు కానీ అనుదీప్ వర్క్ లో డెప్త్ మిస్ కావడంతో థియేటర్స్ కి జనం మొహం చాటేశారు.
అయినప్పటికీ ఫంకీ సినిమా హిట్టే అంటూ విశ్వక్ సేన్ తాజాగా కల్ట్ ఈవెంట్ లో తెలిపాడు. ఎవరు ఏమనుకున్నా కూడా ఫంకీ సినిమా తనకి హిట్టే అని ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను గ్రేట్ సినిమా చేశాను అంటూ చెప్పాడు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక కల్ట్ విషయానికి వస్తే.. తానే ఈ సినిమాని దర్సకత్వం వహిస్తుండగా ఓ క్రేజీ సర్వైవల్ థ్రిల్లర్ గా ఇది రాబోతుంది.
