సుమ అడ్డాలో మాస్ కా దాస్ “లైలా” సందడి!

సుమ అడ్డాలో మాస్ కా దాస్ “లైలా” సందడి!

Published on Jan 22, 2025 2:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా దర్శకుడు రామ్ నారాయణన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రం “లైలా” కూడా ఒకటి. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా కనిపించనుండగా ఇపుడు సినిమా పాటలు ఒకొకటిగా రిలీజ్ కి వస్తున్నాయి.

ఇక ఇవి మాత్రమే కాకుండా ప్రమోషన్స్ కూడా మేకర్స్ స్టార్ట్ చేసేసి ఆల్రెడీ స్మాల్ స్క్రీన్స్ షోస్ లోకి కూడా ఎంటర్ అయ్యిపోయారు. ఇలా ఈటీవీ ఫేమస్ షో “సుమ అడ్డా”లో ఓ స్పెషల్ ఎపిసోడ్ కి గాను వీరు హాజరయ్యి సందడి చేశారు. మరి ఈ ఎపిసోడ్ నెలాఖరు టెలికాస్ట్ కి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా షూటింగ్ కూడా నేటితోనే పూర్తి చేసేయగా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు