విశ్వ‌క్ సేన్ ‘లైలా’ షూటింగ్ ప్రారంభోత్స‌వానికి ముహూర్తం ఫిక్స్!

విశ్వ‌క్ సేన్ ‘లైలా’ షూటింగ్ ప్రారంభోత్స‌వానికి ముహూర్తం ఫిక్స్!

Published on Jul 2, 2024 12:01 AM IST

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు ఈ హీరో. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మిక్సిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఇప్పుడు త‌న నెక్ట్స్ మూవీ ‘మెకానిక్ రాకీ’లో బిజీగా ఉన్నాడు.

కాగా, విశ్వక్ సేన్ ఇప్పుడు మ‌రో కొత్త ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఓ సినిమా చేసేందుకు విశ్వ‌క్ రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జూలై 3న ఉద‌యం 9.30 గంట‌ల‌కు నిర్వ‌హిస్తున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సినిమాలో విశ్వ‌క్ లైలా అనే అమ్మాయి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది.

‘లైలా’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు త‌నిష్క్ బాగ్చి, గిబ్రాన్ లు సంగీతం అందించ‌నున్నారు. ఇక ఈ సినిమాలోని మిగతా నటీన‌టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు