ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఫంకీ’.. ఎప్పుడంటే..?

Funky

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, వాలెంటైన్స్ వీక్ స్పెషల్‌గా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

అయితే, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం మార్చి 13, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ రిలీజ్ గురించి మాత్రమే క్లారిటీ రావడంతో ఇతర భాషల్లో కూడా ఇదే రోజున విడుదలవుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా నరేష్, ఈశ్వరి రావు, సంపత్ రాజ్, జై కృష్ణ కీలక పాత్రలు పోషించారు. నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ‘ఫంకీ’ సిద్ధమవుతుంది.

Exit mobile version