అమ్మాయిగా మారిన విశ్వక్ సేన్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

అమ్మాయిగా మారిన విశ్వక్ సేన్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Published on Jul 3, 2024 9:44 AM IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి విశ్వక్ సేన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే విశ్వక్ సేన్ తా ప్రతి సినిమాకి ఏదొక వైవిధ్యతను కనబరుస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు ఓ సినిమా కోసం అమ్మాయిగా మారాడు.

దర్శకుడు రామ్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రమే “లైలా”. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అమ్మాయిగా చాలా అందంగా కనిపిస్తున్నాడని చెప్పాలి. అలాగే ఈ పోస్టర్ తోనే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసేసారు. దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు